విక్రమ్ మూవీ సీక్వెల్ కి అంతా రెడీ..!

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

విభిన్న క‌థా చిత్రాల్లో...విభిన్న గెట‌ప్స్ తో ఆక‌ట్టుకుంటూ తెలుగు, త‌మిళ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరో విక్ర‌మ్. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ న‌టించిన సంచ‌ల‌న‌ చిత్రం సామి. భారీ విజ‌యం సాదించిన సామి విక్ర‌మ్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. సామి త‌ర్వాత విక్ర‌మ్ - హ‌రి క‌లిసి సామి 2 మూవీ చేయాలి అనుకున్నారు కానీ...కుద‌ర‌లేదు.
ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి సామి 2 చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు. డైరెక్ట‌ర్ హ‌రి ప్ర‌స్తుతం సూర్య‌తో సింగం 3 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విక్ర‌మ్ - హ‌రి కాంబినేష‌న్లో రూపొందే సామి 2 చిత్రాన్ని క‌లై ఫులి ఎస్ థాను నిర్మించ‌నున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.