సక్సెస్ ఫుల్ మూవీకి సీక్వెల్ రెడీ..!
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో ధనుష్ నటించిన చిత్రం వి.ఐ.పి. ఈ చిత్రం తమిళ్ లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో రఘువరన్ బి.టెక్ టైటిల్ తో రిలీజ్ చేసారు. ఈ మూవీ తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు ట్విట్టర్ ద్వారా సౌందర్య రజనీకాంత్ ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని కబాలి చిత్ర నిర్మాత కలై ఫులి ఎస్ థాను వి క్రియేషన్స్, వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సక్సెస్ ఫుల్ మూవీ సీక్వెల్ కి రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తుండడం ఓ విశేషం అయితే...ఈ చిత్రానికి కథ - మాటలు ధనుష్ అందిస్తుండడం మరో విశేషం. వి.ఐ.పి చిత్రం ధనుష్ 25వ చిత్రం కాగా, వి.ఐ.పి 2 33వ చిత్రం. తెలుగు, తమిళ్ లో రూపొందించే ఈ చిత్రాన్ని డిసెంబర్ లో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments