కార్తికేయ సీక్వెల్
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు నాగచైతన్య హీరోగా మజ్ను సినిమా పనుల్లో బిజీగా ఉన్న చందు మొండేటికి దర్శకుడిగా తొలి సినిమా ఇదే. నిఖిల్ సరసన స్వాతి నటించిన రెండో సినిమా. సుబ్రమణ్యస్వామి గుడి, అందులో పాము, ఆ సర్పానికి హిప్నటైజ్ చేయడం వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో రావు రమేష్ ఆలయ అధికారిగా నటించారు. తొలి సినిమా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచో రెండో సినిమాను మొదలు పెట్టడానికి చందు మొండేటి నిర్ణయించారట. ఆ మేరకు స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సీక్వెల్ లో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు నిఖిల్. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం తర్వాత నిఖిల్ నటించే సినిమా ఇదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com