అభినేత్రి సెంటిమెంట్ అదిరింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పోరేషన్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతుంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అభినేత్రి చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...అభినేత్రి ట్రైలర్ ను ఈనెల 9న రిలీజ్ చేయనున్నారు. అయితే...9వ నెల 9వ తేదీన 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయ్యాలని ఫిక్స్ అయ్యారట. 9-9-9-9 కలిసే రోజున అభినేత్రి ట్రైలర్ రిలీజ్ చేయడం సెంటిమెంట్ అదిరింది. మరి...ఈ సెంటిమెంట్ అభినేత్రికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com