గిరిజన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సెంథిల్..

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

ధర్మపురి ఎంపీ సెంథిల్ కుమార్ గిరిజన విద్యార్థులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలన్నీ ఆన్‌లైన్ క్లాసులకే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల కోసం ఆన్‌లైన్ తరగతులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే తమిళనాడులోని నీలగిరి జిల్లాకు చెందిన గిరిజన గ్రామాల్లోని పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేంత స్తోమత లేదు. దీంతో వారు తమ క్లాసులను మిస్ అవుతామనే ఆందోళనతో ఓ ఆలోచనకు వచ్చారు. మొబైల్ ఫోన్లను కొనేందుకు విరాళాలు సేకరించాలని భావించారు. తద్వారా తాము కూడా తరగతులను కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించింది.

ఆ వార్తను సోషల్ మీడియా ద్వారా చూసిన ధర్మపురి ఎంపీ డాక్టర్. సెంథిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ గిరిజన గ్రామాలకు చెందిన వ్యక్తుల నంబర్లు కావాలని ఆ ఆర్టికల్‌ను ప్రచురించిన మీడియా సంస్థను కోరారు. ఆ విద్యార్థులకు అవసరమైన మొబైల్ ఫోన్లను అందజేస్తామని వెల్లడించారు. ‘‘ఆన్‌లైన్ క్లాసులను కోల్పోకుండా ఉండేందుకు స్మార్టు ఫోన్లు కావల్సిన గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థుల నంబర్లను షేర్ చేయండి. కొందరు స్నేహితుల సహకారంతో మొబైల్ ఫోన్లను కొని వారికి అందజేస్తాం’’ అని సెంథిల్ పేర్కొన్నారు.

More News

విజయ్ దేవరకొండ 'ఇన్ స్టా గ్రామ్' లో 8 మిలియన్ ఫాలోయర్స్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ..

టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.