సెన్సెక్స్ సంచలనం.. 50 వేల మార్కు దాటి రికార్డ్..

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఈ రోజు సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా మహమ్మారి కారణంగా పడిపోయిన సెన్సెక్స్ నేడు ఊహించని రీతిలో ఎగిసింది. ఎన్నడూ లేనంత ఉన్నత స్థితికి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉద‌యం తొలిసారి ఏకంగా 50 వేల మార్క్‌ను దాటింది. 335 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభం కాగానే లాభాల బాట పట్టిన సెన్సెక్స్.. ఆల్‌టైమ్ హై 50,126.73 పాయింట్ల‌ను చేరింది. అటు నిఫ్టీ సూచీ కూడా తొలిసారిగా 14,700 పాయింట్లకు చేరింది.

అన్ని సూచీల్లో ఇదే ఉత్సాహం..

గ‌త సంవత్సరం క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా గ‌త మార్చి నెల‌లో సెన్సెక్స్ 25,638 పాయింట్ల‌కు ప‌డిపోయింది. 10 నెలల కాలంలోనే అంత‌కు రెట్టింపు స్థాయికి చేరడం విశేషం. నేటి ఉదయం లాభాలతో మొదలైన ట్రేడింగ్ ఉదయం 9:29 గంటల సమయంలో 50 వేల మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ప్రధాన రంగాల అన్ని సూచీల్లో ఇదే ఉత్సాహం కనిపించడం విశేషం. గేట్‌వే డిస్ట్రిపార్క్స్, జేకే టయర్స్, హవేల్స్ ఇండియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సూర్య రోష్ని లిమిటెడ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అదే సమయంలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఆగ్రోటెక్ ఫుడ్స్, జీఎంఎంలు భారీ నష్టాల్లో ఉన్నాయి.

జో బైడెన్ ప్రభావం..

అమెరికా అధ్య‌క్షునిగా జో బైడెన్ ప్ర‌మాణం చేసిన రోజున అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దీని ప్రభావం భార‌త మార్కెట్ల‌పై సానుకూలంగా కనిపించింది. అమెరికా నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారంతో మదుపురులు మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బైడెన్ త్వరలో పలు ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెడతారని వారు భావిస్తున్నారు. అలాగే ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలిగే అవకాశం కూడా ఉండటం సెన్సెక్స్ లాభాల బాట పట్టడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఇక మనదేశంలోనూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్‌పై పాటిజివ్ అప్ డేట్ వస్తుండటంతో పెట్టుబడిదారులు ఆశావహ దృక్ఫధంతో ఉన్నారు.

More News

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. వాట్ నెక్ట్స్!?

ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఎన్నికలు.. జరుగుతాయా? లేదా? జరపాలని ఒకరు పట్టుబడితే..

మెద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న‌ అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి.

‘మెగా’ టాస్క్‌‌ను తమన్ ఎలా కంప్లీట్ చేస్తారో..?

ప్రస్తుతమున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ టాప్‌లో ఉన్నారు. తాజాగా ఆయన అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారు.

మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ సిద్ద‌మ‌వుతోందా..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

సూర్య సినిమాలో ర‌ష్మిక ప్లేస్ ప‌ట్టేసిన శర్వానంద్ హీరోయిన్‌..!

హీరో సూర్యకు గత ఏడాది బాగానే క‌లిసొచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య‌కు 2020లో విడుద‌లైన ‘ఆకాశం నీహ‌ద్దురా’ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది.