సెన్సెక్స్ సంచలనం.. 50 వేల మార్కు దాటి రికార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ రోజు సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా మహమ్మారి కారణంగా పడిపోయిన సెన్సెక్స్ నేడు ఊహించని రీతిలో ఎగిసింది. ఎన్నడూ లేనంత ఉన్నత స్థితికి చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉదయం తొలిసారి ఏకంగా 50 వేల మార్క్‌ను దాటింది. 335 పాయింట్లతో ట్రేడింగ్ ప్రారంభం కాగానే లాభాల బాట పట్టిన సెన్సెక్స్.. ఆల్‌టైమ్ హై 50,126.73 పాయింట్లను చేరింది. అటు నిఫ్టీ సూచీ కూడా తొలిసారిగా 14,700 పాయింట్లకు చేరింది.
అన్ని సూచీల్లో ఇదే ఉత్సాహం..
గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి నెలలో సెన్సెక్స్ 25,638 పాయింట్లకు పడిపోయింది. 10 నెలల కాలంలోనే అంతకు రెట్టింపు స్థాయికి చేరడం విశేషం. నేటి ఉదయం లాభాలతో మొదలైన ట్రేడింగ్ ఉదయం 9:29 గంటల సమయంలో 50 వేల మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ప్రధాన రంగాల అన్ని సూచీల్లో ఇదే ఉత్సాహం కనిపించడం విశేషం. గేట్‌వే డిస్ట్రిపార్క్స్, జేకే టయర్స్, హవేల్స్ ఇండియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సూర్య రోష్ని లిమిటెడ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అదే సమయంలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఆగ్రోటెక్ ఫుడ్స్, జీఎంఎంలు భారీ నష్టాల్లో ఉన్నాయి.
జో బైడెన్ ప్రభావం..
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణం చేసిన రోజున అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై సానుకూలంగా కనిపించింది. అమెరికా నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారంతో మదుపురులు మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బైడెన్ త్వరలో పలు ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెడతారని వారు భావిస్తున్నారు. అలాగే ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలిగే అవకాశం కూడా ఉండటం సెన్సెక్స్ లాభాల బాట పట్టడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఇక మనదేశంలోనూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్‌పై పాటిజివ్ అప్ డేట్ వస్తుండటంతో పెట్టుబడిదారులు ఆశావహ దృక్ఫధంతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout