Viveka:వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు.. ఆ నేతలకు భారీ షాక్..

  • IndiaGlitz, [Thursday,April 18 2024]

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తున్నారు. వివేకా హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కడపలో ప్రచారం చేస్తున్న పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, సునీతా రెడ్డి అయితే వివేకా హత్యకు కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డినే కారణమని ఆరోపిస్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ కూడా ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

దీంతో తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా రాజకీయ నేతలు పదే పదే వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని.. తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్‌ తరఫున నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన తీసుకురావద్దని షర్మిలతో పాటు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, పవన్ కల్యాణ్, నారా లోకేష్, సునీతారెడ్డిలకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా కొద్ది రోజులుగా వివేకా హత్య కేసు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అజెండాగా మారిపోయింది. ప్రతిపక్ష నేతలు ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. వివేకా హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని.. ఆయనకు జగన్ అండగా నిలుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజల్లో వివేకా హత్య కేసు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందిగా మారింది. కోర్టుల పరిధిలో ఉన్న కేసు గురించి బహిరంగంగా ఎలా ప్రచారం చేస్తారని నిలదీస్తున్నారు. ఎన్నికల వేళ తమను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కోర్టును ఆశ్రయించారు.

More News

Supreme Court:ఎన్నికల ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను ఉపయోగించనుంది.

KCR:ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు.. రాబోయే రోజులు మనవే: కేసీఆర్

భవిష్యత్తులో ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తార‌ని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ తెలిపారు.

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్

సీఎం జగన్‌పై రాయి దాడి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

Janasena: జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

ఎన్నికల వేళ జనసేన పార్టీకి కోనసీమ జిల్లాలో భారీ షాక్ తగిలింది. రాజోలు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు.

Teja Sajja :సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా.. కొత్త సినిమా గ్లింప్స్ గూస్‌బంప్స్ అంతే..

‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ యువహీరో తేజ సజ్జా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు.