న్యాయవాద దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

  • IndiaGlitz, [Thursday,February 18 2021]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుల దేవత గుడి వివాదమే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. కుల దేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడని టీఆర్ఎస్ నాయకుడు కుంటా శ్రీనివాస్ హెచ్చరించాడు. ఈ కేసులో ఓ ఆడియో క్లిప్ కీలకంగా మారింది. పోలీసులు కుమార్, చిరంజీవి, దాస్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుంటా శ్రీను కాల్ డేటాను రామగుండం పోలీసులు పరిశీలిస్తున్నారు.

గుడిని కూల్చేస్తే కూలిపోతావని హెచ్చరిక..

గట్టు వామన్‌రావు స్వగ్రామం గుంజపడుగులోని గుడి వివాదమే వారి హత్యలకు ముఖ్య కారణమని పోలీసులు భావిస్తున్నారు. గుడిని కూల్చేస్తే వామన్‌రావు కూలిపోతాడని కుంట శ్రీను గతంలో హెచ్చరించినట్టు తెలుస్తోంది. వామన్‌రావు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో కుంటా శ్రీనివాస్‌ ఆడియోను సేకరించారు. కుంటా శ్రీనివాస్‌ గతంలో సికాసలో పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కుంటా శ్రీనివాస్‌పై అనేక కబ్జా, బెదిరింపుల కేసులు నమోదయ్యాయి. ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులున్నట్టు పోలీసులు తేల్చారు. కుంటా శ్రీనివాస్‌ను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

అసలు ఏంటా గుడి వివాదం?

వామనరావు హత్యకు గుడి వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ గుడి వివాదం ఏంటంటే.. వామన్‌రావు స్వగ్రామమైన గుంజపడుగులో రామస్వామి గోపాలస్వామి రామాలయానికి ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. అయితే గతంలో ఈ కమిటీకి కార్యదర్శిగా వామన్‌రావు సోదరుడు ఇంద్రశేఖర్ ఉన్నారు. అయితే ఇటీవల తన తమ్ముడిని కాదని గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ వసంతరావు.. పుట్ట మధుకర్‌ చేత బ్రాహ్మణ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరింపజేసి కమిటీ వేయించాడని వామనరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ అనుమతుల్లేకుండా ఇంటి నిర్మాణం, ఆలయ నిర్మాణం చేపట్టడంపైనా కేసులు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే హత్యకు కారణమని తెలుస్తోంది.

కారు డ్రైవరే కోవర్టు?

తమ గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌ తమపై దాడి చేశారని రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ హత్య కేసులో వామనరావు కారు డ్రైవర్‌ సతీశ్‌ కీలకంగా మారాడు. ఈ హత్యలకు అతనే కోవర్టుగా మారాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు కారు అద్దాలు పగలగొడుతున్న సమయంలో సతీష్ కారును అక్కడే వదిలేసి పారిపోవడం.. దుండగులు వెళ్లిన తర్వాత అతను సంఘటన స్థలానికి చేరుకోవడం అంతా పెద్ద మిస్టరీగా ఉంది. ఇప్పటికే పోలీసులు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More News

చెర్రీతో పాటు హృతిక్ పేరిట ఉన్న రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసిన వైష్ణవ్

హీరో వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమాతోనే స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. వైష్ణవ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ చిత్రం ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతిలా చేయడానికి సిద్ధం.. కాకపోతే..: అల్లరి నరేష్

‘అల్లరి’ నరేష్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. జూనియర్ రాజేంద్రప్రసాద్‌లా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం రూటు మార్చేశాడు.

'పాగ‌ల్' టీజ‌ర్ విడుద‌ల‌

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వ‌క్ సేన్ మునుప‌టి సినిమా హిట్ మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ట‌యింది. ఆయ‌న న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పాగ‌ల్'‌.

అయోధ్య రామమందిరానికి వెండి ఇటుకలు పంపొద్దు: తీర్థక్షేత్ర ట్రస్ట్

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం నిర్మాణానికి తమ వంతు సాయం అందించాలని భావిస్తున్న భక్తులు ధనం లేదంటే వెండి ఇటుకలనో ఎంచుకుంటున్నారు.

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులను సుమారు వంద మంది చూస్తుండగానే విచక్షణారహితంగా నరికి చంపేశారు.