బి గ్రేడ్ నటి, అడుక్కుంటుంది.. తాప్సిపై సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Friday,July 02 2021]

ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి కోపం వస్తే ఇక అంతే. ఎదుటివారు ఎవరైనా సరే నిప్పులు చెరిగేస్తుంది. గత కొంత కాలంగా కంగనా వర్సస్ బాలీవుడ్ అన్నట్లుగా ఫైట్ సాగుతోంది. కంగనా చాలా మంది దర్శకులు, నటులు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వారిపై విరుచుకుపడుతోంది.

ఇటీవల మాత్రం తాప్సి అంటే కంగనకు ఏమాత్రం పొసగడం లేదు. తాప్సి పేరు వినిపించగానే కంగనా చెడామడా తిట్ల వర్షం కురిపించేస్తోంది. ఇటీవల తాప్సి ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ గురించి మాట్లాడింది.

ఇదీ చదవండి: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై రాజమౌళి అసంతృప్తి.. విదేశీయులు ఇలాంటివి చూస్తే..

కంగనా రనౌత్ ని నేను ఎప్పటికి మంచి నటిగా భావిస్తాను అని తాప్సి చెప్పింది. ఇటీవల కంగనా ట్విట్టర్అకౌంట్ అకౌంట్ బ్యాన్ కావడం గురించి స్పందిస్తూ.. ఆమె ట్విట్టర్ లో లేకపోవడం వల్ల నేనేమి మిస్ కావడం లేదు. కంగనాపై నాకు గుడ్, బ్యాడ్ ఫీలింగ్స్ ఏమీ ఉండవు అని తాప్సి చెప్పింది. కంగనా వ్యక్తిగత జీవితం వల్ల తనకు వచ్చే నష్టం, లాభం ఏమీ ఉండదు అని తాప్సి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించింది. కంగనా గురించి మాట్లాడడం ఇర్రెలవెంట్.. నేను ద్రుష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని తాప్సి అవాయిడ్ చేసే ప్రయత్నం చేసింది.

ఈ కామెంట్స్ పై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో రియాక్ట్ అయింది. ఒక రేంజ్ లో ఈ ఫైర్ బ్రాండ్ లేడి తాప్సికి చురకలంటించింది. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. తాప్సి ఒక బి గ్రేడ్ నటి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కంగనా.

ఒక బి గ్రేడ్ నటి నా పేరు వాడుకుంటే నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆమె ఇండస్ట్రీలో ఎదగడానికి నా పేరు వాడుకుంటోంది అని తెలుసు. నేను కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి వైజయంతి మాల, శ్రీదేవి లాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నాను. నేను వారిని ఎప్పుడూ కించపరచలేదు.

నేను వదిలేసిన సినిమాలు ఇమ్మని దర్శకులని, ప్రొడ్యూసర్స్ ని అడుక్కుంటావు. అప్పుడు నేను ఇర్రెలవెంట్ అనిపించలేదా. ఏదైతేనేం.. అమ్మాయి తాప్సి నీ నెక్స్ట్ మూవీకి ఆల్ ది బెస్ట్. నా పేరు వాడుకోకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించు అంటూ కంగనా తాప్సికి చురకలంటించింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.