టీడీపీకి పెద్దదిక్కు గుడ్ బై.. త్వరలో బీజేపీలోకి!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఇటు టీడీపీ.. అటు కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడ్డ సంగతి తెలిసిందే. ఫలితాల తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవడానికి కమలనాథులు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలేపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మరికొందరు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ బీజేపీ నేతలు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. కమలనాథుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పెద్ద దిక్కు టీడీపీకి గుడ్ బై!!
ఇప్పటి వరకూ టీడీపీకి గుడ్ బై చెప్పినవారు ఒక ఎత్తయితే.. తాజాగా గుడ్ బై చెప్పడానికి సిద్ధమైన నేత ఓ లెక్క. ఆయన మరెవరో కాదు.. గుంటూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా.. పార్టీని ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్న రాయపాటి సాంబశివరావు. అయితే ఈ విషయాన్ని స్వయానా ఆయనే మీడియాకు చెప్పడం గమనార్హం. తాను ఎవరి ద్వారా బీజేపీ తీర్థం పుచ్చుకోవట్లేదని.. స్వతహాగా తనకు తానుగా కాషాయం కండువా కండువా కప్పుకోబోతున్నానని చెప్పుకొచ్చారు. ఈయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెనుదుమారం రేపుతున్నాయి.
టాటా చెప్పడానికి అసలు కారణాలివీ..!
కాగా.. ఎన్నికల్లో పరాజయ భారం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే టీడీపీకి వరుస దెబ్బలు తగులుతూ కోలుకోలేని రీతిలో పరిస్థితి ఉంది. రాయపాటి 2019 ఎన్నికలకు ముందు నుంచి ఈయన టీడీపీకి టాటా చెప్పి వైసీపీలో చేరతారని టాక్ నడిచింది. ఇందుకు కారణం తన కుమారుడికి సత్తెనపల్లి టికెట్ ఇవ్వడంతో పాటు.. తనకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అది జరగలేదు కానీ.. రాయపాటికి మాత్రమే ఎంపీ టికెట్ దక్కింది. అంతకుముందు టీటీడీ చైర్మన్ పదవి కూడా దక్కకపోవడం.. ఆ తర్వాత రెండు టికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రాయపాటి ఫ్యామిలీకి పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. అయితే ప్రస్తుతం వైసీపీలోకి వెళ్లడానికి దారులన్నీ మూసుకుపోవడం.. బీజేపీలో దారులన్నీ తెరుచుకుని ఉండటంతో రాయపాటి కాషాయ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రెండ్రోజుల క్రితం గుంటూరులోని రాయపాటి నివాసానికి రాగా.. ఆయన గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. ఆ తర్వాతే బీజేపీలో చేరాలని రాయపాటి ఫిక్సయ్యారని సమాచారం. అయితే రాయపాటి ఎప్పుడు చేరతారో..? ఎవరి ద్వారా పార్టీలో చేరతారో..? ఆయన పార్టీలో చేరితే పరిస్థితేంటి..? ఆయనకు అధిష్టానం ఏ హోదా కల్పించబోతోంది..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com