సీనియ‌ర్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌న్ క‌న్నుమూత

  • IndiaGlitz, [Tuesday,April 02 2019]

సీనియ‌ర్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌న్‌(79) నేడు ఆయ‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొన్ని రోజులుగా అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స చేయించుకుంటున్నారు.

సోమ‌వారం ఆయ‌న హాస్పిట‌ల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వ‌చ్చారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న క‌న్నుమూశార‌నే విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. మ‌హేంద్ర‌న్ మృతికి సినీ ప్ర‌ముఖులు సానుభూతిని తెలియ‌జేస్తున్నారు.

నేటి సాయంత్రం ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న జె.మ‌హేంద్ర‌న్.. ఇండ‌స్ట్రీలోకి స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 26 సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు. 12 సినిమాల‌ను డైరెక్ట్ చేశారు.