సీనియర్ నిర్మాత కన్నుమూత...
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు(92) ఈ రోజు అనారోగ్యంతో మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. పూర్ణచంద్రరావుకి భార్య మరుద్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిర్మాతగా ఆయన స్త్రీ, ఆడపడుచు, కలవారి కోడలు, వెంకీ, మిస్టర్ అండ్ మిస్ శైలజ కృష్ణమూర్తి సహా పలు చిత్రాలను నిర్మించారు.
హిందీలో కూడా ఆయన ఛోటా బెహన్, అంధాకానూన్, మాంగ్ భరో సజ్‌నా సినిమాలను నిర్మించారు. సీనియర్ నటి, అలనాటి మేటి నటి సావిత్రి దర్శకత్వంలో వచ్చిన మాతృదేవత చిత్రాన్ని కూడా ఈయనే నిర్మించారు. సీనియర్ దర్శకులు ప్రత్యగాత్మ, హేమాంబర్‌ధరరావు ఈయనకు బంధువులు. వీరి సహకారంతోనే అట్లూరి సినీ రంగంలోకి ప్రవేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com