సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ ప్రాజెక్టులు
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, బాహుబలి2 చిత్రాలతో మరోసారి వార్తల్లో నిలిచారు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి. ఆయా 2 చిత్రాల విజయాల్లో ఆయన అందించిన సంగీతం కీలక పాత్ర పోషించింది. బాహుబలి తరువాత సినిమా సంగీతానికి దూరంగా ఉందామనుకున్న కీరవాణి.. తన మనసు మార్చుకున్నారని తెలిసింది. కాగా, ఆయన తాజాగా రెండు చిత్రాలకు ఓకే చెప్పారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రేమమ్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య, యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రానున్న సవ్యసాచి చిత్రానికి కీరవాణి సంగీతమందించనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కాగా, మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఆయన బయోపిక్‌కి కూడా ఈ దిగ్గజ సంగీత దర్శకుడు స్వరాలు అందించనున్నారని తాజాగా కథనాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మే 28న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com