సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ ప్రాజెక్టులు

  • IndiaGlitz, [Friday,October 20 2017]

బాహుబ‌లి, బాహుబ‌లి2 చిత్రాల‌తో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి. ఆయా 2 చిత్రాల విజ‌యాల్లో ఆయ‌న అందించిన సంగీతం కీల‌క పాత్ర పోషించింది. బాహుబ‌లి త‌రువాత సినిమా సంగీతానికి దూరంగా ఉందామ‌నుకున్న కీర‌వాణి.. త‌న మ‌న‌సు మార్చుకున్నార‌ని తెలిసింది. కాగా, ఆయ‌న తాజాగా రెండు చిత్రాల‌కు ఓకే చెప్పార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రానున్న స‌వ్య‌సాచి చిత్రానికి కీర‌వాణి సంగీత‌మందించ‌నున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. కాగా, మ‌హాన‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఆయ‌న బయోపిక్‌కి కూడా ఈ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు స్వ‌రాలు అందించ‌నున్నార‌ని తాజాగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ భాష‌ల్లో వ‌చ్చే ఏడాది మే 28న‌ ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

నాని.. వరుసగా మూడో సంవత్సరం

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో నాని ఒకరు. 2015లో విడుదలైన భలే భలే మగాడివోయ్ నుంచి ఈ జూలై నెలలో వచ్చిన నిన్నుకోరి వరకు వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకున్నాడాయన.

ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఝలక్

ప్రజా సమస్యలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారుల కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు తమ సీట్లలోంచి లేచి వారికి స్వాగతం పలకాలని, మరల తిరిగి వారు వెళ్లేటప్పుడు కూడా వారికి ఇలాంటి గౌరవమే వారికి ఇవ్వాలంటూ...

డిసెంబర్ లో 'భాగ్ మతి'?

అరుంధతితో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు మళ్లీ ఊపు వచ్చింది. కంటెంట్ బాగుంటే.. విమెన్ సెంట్రిక్ సినిమాలకు కూడా స్టార్ హీరోల స్థాయిలో కలెక్షన్లు రాబట్టవచ్చని ఆ చిత్రం నిరూపించింది..

వెంకీతో మెహరీన్ ?

గురు చిత్రం తరువాత విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రమేదీ పట్టాలెక్కలేదు. నేనే రాజు నేనే మంత్రితో సక్సెస్ అందుకున్న దర్శకుడు తేజతో వెంకీ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకే సినిమా.. మూడు హ్యాట్రిక్ లు

దీపావళి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా రాజా ది గ్రేట్. బెంగాల్ టైగర్ తరువాత దాదాపు రెండేళ్ల గ్యాప్తో మాస్ మహారాజ్ రవితేజ తెరపై సందడి చేసిన చిత్రమిది.