Senior journalist Uma Sudhir:టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్ర ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి రోజాపై టీడీపీ సీనీయర్ బండారు సత్యానారాయణ చేసిన దారుణ వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి రోజా పట్ల టీడీపీ నేతలు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. తక్షణమే టీడీపీ అధిష్టానం, నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళలపై నీచపు వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..
ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ తరుణంలో కూడా మహిళలపై చిన్న చూపు చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాగే స్కాట్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులపై నీచపు వ్యాఖ్యలు చేశారని.. అందుకే ఆ దేశాలు అభివృద్ధిలో వెనకబడిపోయాయని వెల్లడించారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాకూడదంటే మహిళల గురించి చులకగా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని ఉమా సుధీర్ ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments