Senior journalist Uma Sudhir:టీడీపీ నేత బండారు సత్యనారాయణపై సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్ర ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

మంత్రి రోజాపై టీడీపీ సీనీయర్ బండారు సత్యానారాయణ చేసిన దారుణ వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి రోజా పట్ల టీడీపీ నేతలు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. తక్షణమే టీడీపీ అధిష్టానం, నేతలు మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలపై నీచపు వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ తరుణంలో కూడా మహిళలపై చిన్న చూపు చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాగే స్కాట్లాండ్, న్యూజిలాండ్‌ దేశాల్లో కూడా మహిళా ప్రజాప్రతినిధులపై నీచపు వ్యాఖ్యలు చేశారని.. అందుకే ఆ దేశాలు అభివృద్ధిలో వెనకబడిపోయాయని వెల్లడించారు. అలాంటి పరిస్థితి మన దేశంలో రాకూడదంటే మహిళల గురించి చులకగా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని ఉమా సుధీర్ ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

More News

Pawan Kalyan:ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జనసేన.. పవన్ మాటల వెనక ఆంతర్యమేంటి..?

కృష్ణా జిల్లా పెడనలో జరిగిన వారాహి యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actress Kavitha:మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా? అని నటి కవిత ఆగ్రహం

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సినీ నటి కవిత తీవ్రంగా ఖండించారు.

Prema Vimanam:ఫన్, ఎమోషన్‌ మేళవింపుగా 'ప్రేమ విమానం' .. ఆకట్టుకుంటున్న ట్రైలర్, జీ5లో డైరెక్ట్ రిలీజ్

భారతదేశంలో ఓటీటీ మార్కెట్ నానాటికీ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తూ..

Bigg Boss 7 Telugu : చీటింగ్ చేయలేదంటూ యావర్ కన్నీళ్లు .. టాస్క్‌ల్లో రెచ్చిపోయిన శివాజీ-ప్రశాంత్

బిగ్‌బాస్‌లో 7 విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.

Pawan Kalyan:కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదు.. పెడన వారాహి సభలో పవన్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్‌కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.