Pedada Murthy : సినీ గీత రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ , గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూర్తి వయసు 52 సంవత్సరాలు. ఆయనకు భార్య సంధ్య, కుమార్తు సుగాయత్రి, కుమారుడు అభిజిత్ వున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో జన్మించిన పెద్దాడ మూర్తి.. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సీనియర్ జర్నలిస్ట్ పతంజలికి శిష్యుడిగా మారారు. అనంతరం దిగ్గజ సినీ గేయ రచయిత వేటూరి స్పూర్తితో హైదరాబాద్ వచ్చారు. తొలినాళ్లలో ఆంధ్రప్రభ, శివరంజని , సూపర్‌హిట్ వంటి పత్రికలలో పనిచేశారు. ఈ సమయంలో సినీ దర్శకులతో ఏర్పడిన పరిచయాలతో గీత రచయితగా మారారు.
కూతురు సినిమాకు తొలి పాట రాసిన మూర్తి:
తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన ‘‘కూతురు’’ సినిమాకు తొలి గీతాన్ని అందించిన మూర్తి తర్వాత ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, స్టాలిన్, చందమామ వంటి సినిమాలకు పాటలు రాశారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా వున్న భరత్ మూవీ 'నాగలి'కి పెద్దాడ మూర్తి మాటలు, పాటలు అందించారు. మూర్తి రాసిన ‘‘తారా మణిహారం’’ అనే పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలా ఎంతో భవిష్యత్ వున్న మూర్తి హఠాన్మరణంతో తోటి సినీ జర్నలిస్టులు, గేయ రచయితలు, చిత్ర సీమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. బుధవారం హైదరాబాద్ రాజీవ్ నగర్‌లో పెద్దాడ మూర్తి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు.. పెద్దాడ మూర్తి మృతిపట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout