సౌత్ ప్రొడ్యూసర్ ఒక రాత్రి తనతో గడపమన్నాడు: సీనియర్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ల క్రితం అటు బాలీవుడ్, టాలీవుడ్ లో మీటూ, కాస్టింగ్ కౌచ్ సంఘటనలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అయితే పదుల సంఖ్యలో దర్శక నిర్మాతలు, నటులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన బాలీవుడ్ ని కుదిపేసింది. ఇలాంటి సంఘటనలు అప్పట్లో కూడా జరిగేవని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా వ్యాఖ్యలని బట్టి అర్థం అవుతోంది.
నీనా గుప్తా జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పెళ్లి కాకూండానే దిగ్గజ క్రికెటర్ విప్ రిచర్డ్స్ వల్ల తల్లి అయ్యారు. ఒంటరి తల్లిగా తన కుమార్తెని పెంచి పెద్ద చేశారు. నీనా గుప్తా సచ్ కుహూ తో(ఒక వేళ నేను నిజం చెబితే) అనే పేరుతో తన ఆటో బయోగ్రఫీ రాసుకున్నారు.
ఇందులో తన వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, కాస్టింగ్ కౌచ్ ఇలా అన్ని అంశాల గురించి తన అనుభవాలను రాశారు. దక్షిణాదిలో ఓ ప్రముఖ నిర్మాత నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ముంబైలో ఓ హోటల్ కి సినిమా విషయం చర్చించేందుకు ఓ ప్రముఖ నిర్మాత నన్ను పిలిచాడు.
హోటల్ లాబీకి వెళ్లి అతడికి ఫోన్ చేశా. పైన ఉన్న తన గదికి రమ్మని పిలిచాడు. నా మనసు వద్దని చెబుతున్నా అతడి గదికి వెళ్ళాను. సోఫాలో కూర్చున్నాక తన గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు. తాను ఎందరో స్టార్ హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేశానని తెలిపాడు. నాకు ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇస్తానని చెప్పాడు. అది చాలా చిన్న పాత్ర. నాకు నచ్చలేదు.ఇక నేను వెళతా అని చెప్పా.
దీనికి ఆ నిర్మాత చెప్పిన సమాధానం విని షాకయ్యా. వెళతావా.. ఎక్కడికి.. ఈ రాత్రి నాతో గడపడం లేదా ? అని అడిగాడు. నా తలపై చల్లని నీళ్లు పోసినట్లు అనిపించింది. నేను కోపంగా చూశాను. దీనితో నా హ్యాండ్ బ్యాగ్ ని విసిరి నాచేతుల్లో కొట్టాడు. నిన్నెవరూ బలవంతం చేయడం లేదు. వెళ్ళిపో అని చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు నీనా గుప్తా చెప్పుకొచ్చింది. ఆ సంఘటన ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది అని నీనా గుప్తా తన బయోగ్రఫీలో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments