సీనియర్ హీరోయిన్స్‌కు కోర్టు బ్రేక్...
- IndiaGlitz, [Sunday,February 24 2019]
ఒకప్పుడు హీరోయిన్స్‌గా తమ గ్లామర్‌తో వెండితెరను ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ రంభ, రాశి. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. రాశి అమ్మ, అంటీ పాత్రల్లో నటిస్తుంది. రంభ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు.
అయితే ఈ ఇద్దరు కలర్స్ అనే హెల్త్ కేర్ సంస్థకు సంబంధించిన వెయిట్ లాస్ యాడ్‌లో నటించారు. ఆ యాడ్స్ చూసిన ఓ కస్టమర్ సదరు సంస్థకు 75 వేల రూపాయలు చెల్లించారట.
అయితే ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత కూడా సదరు కస్టమర్ వెయిట్లో ఏ మార్పు లేకపోవడంతో.. కన్సుమర్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ యాడ్‌ను ఆపేయాల్సిందంటూ కలర్స్ హెల్త్ కేర్ సంస్థను ఆదేశించిందట.