పవన్ , త్రివిక్రమ్ మూవీలో సీనియర్ హీరోయిన్..!
Wednesday, December 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్నిహారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....సీనియర్ హీరోయిన్ కుష్బు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కుష్బు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇంతకీ కుష్బు ఏమన్నారంటే...గుడ్ న్యూస్ ఏమిటంటే...9 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. పవన్ & త్రివిక్రమ్ ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాను అని తెలియచేసారు. అన్నయ్య చిరంజీవి స్టాలిన్ చిత్రంలో నటించిన కుష్బు ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments