VK Naresh:మమ్మల్ని అల్లరి చేస్తున్నారు.. సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌కు నరేష్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Friday,February 17 2023]

సీనియర్ హీరో నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పవిత్రా లోకేష్‌పై తన బంధానికి సంబంధించి కొందరు హద్దులు మీరి ట్రోలింగ్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక కొందరున్నారని చెప్పిన ఆయన ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు.

గతేడాది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్:

ఇకపోతే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు సంబంధించి పవిత్రా లోకేష్ గతేడాది నవంబర్ 26న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో రిలేషన్‌లో వున్న నరేష్‌‌పైనా, తనపైనా కొన్ని వెబ్‌సైట్లు, ఛానెళ్స్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పవిత్రా లోకేష్ తెలిపారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించామని .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.

టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను కుదిపేసిన పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్:

కాగా... పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపింది. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది.

లిప్ కిస్ పెట్టుకున్న నరేశ్-పవిత్రా లోకేష్:

అయితే న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ఈ సస్పెన్స్‌కు తెరదించారు నరేశ్- పవిత్రా లోకేష్. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో వదిలారు. సినిమా ప్రోమోకు ఏ మాత్రం తగ్గని విధంగా కట్ చేసిన ఆ వీడియోలో నరేశ్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని కలకలం రేపారు. 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతోందని... అంతా తమను ఆశీర్వదించాలని ఈ జంట ప్రేక్షకులను కోరింది.

More News

Oo Antava Mava Ooo:శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ రిలీజ్

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం

SIR: 'సార్' సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం..

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు,

Katha Venuka Katha:డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఆవిష్క‌రించిన  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ‘కథ వెనుక కథ’ టీజ‌ర్‌

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

Puli Meka:మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన జీ 5 ‘పులి మేక’ టీజర్

సాధార‌ణంగా నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. మ‌రి వారినే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు?

Premi Viswanath : కార్తీకదీపంలో ‘నల్ల’ పిల్ల క్యారెక్టర్ వల్ల చిక్కులు.. అలర్జీ బారినపడ్డ వంటలక్క

ప్రేమి విశ్వనాథ్.. అంటే గుర్తుపట్టడం కష్టమే. అదే కార్తీక దీపం వంటలక్క అంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు టక్కున బుర్రలో లైట్ వెలుగుతుంది.