రానాకి కథ చెప్పిన సీనియర్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి` సిరీస్ ఇచ్చిన విజయంతో వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ 1945`, తమిళ చిత్రం ఎనై నోకి పాయం తోట` (ఇందులో అతిథి పాత్ర) సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా....తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ హాథీ మేరే సాథీ` ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక మలయాళంలో అనిళం తిరునాల్ మార్తాండ వర్మ` చిత్రంలో నటిస్తున్నట్లు కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు రానా.
ఇదిలా వుంటే...సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్‌లో రానా ఓ మూవీ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కృష్ణవంశీ.. ఒక నవలాధారంగా తయారుచేసుకున్న కథని రానాకి వినిపించారని....తాజాగా దీనికోసం రెండు సార్లు రానాతో మాట్లాడారని కూడా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. గత కొంత కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీకి రానా కాంబినేషన్‌తోనైనా విజయం దక్కుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments