సీనియర్ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
షమ్మీ కపూర్‌తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్ (1969) చిత్రాలతో పాటు రాజేంద్రకుమార్, శశికపూర్, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలతో పాటు...సునీల్ దత్, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లేఖ్ టాండన్ ఈరోజు ముంబై పావైలో కన్నుమూశారు.
ఈయన తెరకెక్కించిన అమ్రపాలి చిత్రం విదేశీ సినిమాల కేటగిరిలో 39వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో భారత్ తరఫున పోటీపడటం విశేషం. 1988లో ఆయన తెకరెక్కించిన దిల్ దరియా అనే సీరియల్ ద్వారా షారూఖ్ ఖాన్‌ను పరిచయం చేశారు. దర్శకుడిగానే కాకుండా స్వదేశ్, రంగ్ దే బసంతి, చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాల్లో నటించారు. లేఖ్ టాండన్ మృతికి పులువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com