ప్రభాస్ కొత్త చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్!!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాతో నేషనల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత వచ్చిన సాహోతో ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే ఈసారి చేస్తున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటన్నాడు.రీసెంట్‌గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తుంది. సోమవారం నుండి ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నారట.
1970 బ్యాక్‌డ్రాప్‌తో లింక్ అవుతూ నేటి కాలానికి కొనసాగే ప్రేమకథాశంతో ఈ సినిమా ఉంటుందట. పూర్వజన్మలో ధనవంతుడిగా ప్రభాస్, పేద అమ్మాయిగా పూజా హెగ్డే పుడుతుందట. ఆ సమయంలో విఫలమైన వారి ప్రేమ ఇప్పటి కాలంలో ఎలా కలిసిందనేదే కథట. ప్రభాస్ ఇందులో హస్తసాముద్రిక తెలిసిన వ్యక్తిగా కనపడబోతున్నాడట. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణమూవీస్ పతాకాలపై సినిమా నిర్మితమవుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com