అలనాటి ప్రముఖ నటి సీత మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి ప్రముఖ నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత(87) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని వందల చిత్రాలలో ఆమె నటించారు. దేవదాసు, మాయాబజార్ వంటి ఎన్నో చిత్రాల ద్వారా మంచి నటిగా సీత గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త నాగభూషణంతో కలిసి ఆమె ఒక డ్రామా ట్రూప్‌ను కూడా నడిపారు. నాగభూషణంకి అత్యంత పేరు తెచ్చి పెట్టిన నాటిక ‘రక్త కన్నీరు’. అప్పటి నుంచే ఆయనకు ‘రక్త కన్నీరు’ నాగభూషణంగా పేరు పడింది. ఈ నాటికంలో సీత కీలక పాత్ర పోషించారు. సుందరి అనే వాంప్ పాత్రలో సీత నటించారు.
భర్త నాగభూషణానికి చేదోడు వాదోడుగా సీత నిలిచేవారు. దీంతో ఆమెను ఇండస్ట్రీలో నాగభూషణం సీతగానే పిలిచేవారు. సీత కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే కావడం విశేషం. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించింది. అయితే నాగభూషణానికి సీత రెండో భార్య కావడం గమనార్హం. సీత అంత్యక్రియలు మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments