ఆర్థిక ఇబ్బందులపై సీనియర్ నటి రాశి స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించిన రాశి.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు వంటి హీరోలతో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేయాల్సిన అన్ని పాత్రలూ చేసేసింది. అన్ని పాత్రలకూ న్యాయం చేసింది గనుక ఇప్పటికీ ఈమె పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. నాటి నుంచి నేటికి ఆమెకు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయ్. కాగా.. కొన్ని రోజుల క్రితం రాశి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. అష్టకష్టాలు పడుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అది చూసిన పలువురు వీరాభిమానులు, ఆమె ఆప్తులు రాశికి ఫోన్ చేసి ఆరా తీశారు.
అవన్నీ నిరాధారం..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘నేను ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలన్ని నిరాధారం. నేను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నా.. నేను జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాను. ఒక ప్రతి మనిషి జీవితంలో సమస్యలనేవి కామన్. వాటిని ఎంతో ధైర్యంగా దాటుతూ ముందుకు సాగాలి’ అని రాశి చెప్పుకొచ్చారు. కాగా.. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన రాశీ.. అక్క, తల్లి క్యారెక్టర్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com