Actress Rambha : హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్.. పిల్లలతో వస్తుండగా, అంతలోనే
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి స్టార్ హీరోయిన్ రంభ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రంభతో పాటు ఆమె పిల్లలు, మరో మహిళ ఒకరు వున్నారు. యాక్సిడెంట్ విషయాన్ని రంభ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సాషా కోసం ప్రార్ధించండి:
పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా మా కారును మరో కారు ఢీకొట్టిందని, అప్పుడు నాతో పాటు పిల్లలు, ఆయా వుందని రంభ పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామని, కానీ సాషా ఇంకా ఆసుపత్రిలోనే వుందని రంభ ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించండి అంటూ ఆమె అభిమానులను కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రంభ:
ఇకపోతే... రాజేంద్రప్రసాద్ సరసన ‘‘ఆ ఒక్కటి అడక్కు’’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన రంభ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్‌పూరి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే కెరీర్ పీక్స్‌లో వుండగా ఇంద్రకుమార్ అనే కెనడా ఎన్ఆర్ఐని పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తర్వాత పలు టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్‌గానూ కనిపించింది. అయితే రంభ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని భావిస్తోందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com