Radhika:మంత్రి రోజాకు అండగా ఉంటా.. బండారు వ్యాఖ్యలపై మండిపడిన సీనియర్ నటి రాధిక

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్భూ బండారు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. ఓ స్నేహితురాలిగా, సహనటిగా, ఎంతో ధైర్యవంతురాలైన మహిళగా రోజా గురించి తెలిసిన వ్యక్తిగా తాను మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, చవకబారు రాజకీయాలు తనను ఎంతగానో బాధించాయన్నారు. దిగజారుడు, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన ఈ తరుణంలో ఓ బాధ్యతా గల పదవిలో ఉన్న మహిళపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తనకు ఆగ్రహం కలిగించాయని ఆమె పేర్కొన్నారు.

టీడీపీ నేతలు మహిళలను ఇలాగేనా గౌరవించేది..?

దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతుందని.. దేశాభివృద్ధిలో మహిళా నాయకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఓ గౌరవనీయ రాజకీయ నాయకుడి నుంచి, ఇలాంటి కామెంట్లు రావడం చాలా బాధాకరమన్నారు. మన దేశాన్ని భారత్‌ మాతగా పిలుచుకుంటామని అంటే మహిళలకు అంతటి గౌరవం ఇచ్చే దేశంలో మహిళలను ఇలాగేనా గౌరవించేది అంటూ మండిపడ్డారు. దారుణంగా మాట్లాడితే మహిళలు భయపడతారనుకుంటే అది చాలా తప్పన్నారు.

మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

ఇలాంటి మాటలతో ఒకరిని హింసించడం వల్ల మీకు ఒరిగిందేమిటి? సమాజంలో మీకు గౌరవం పెరిగిందా? సిగ్గేస్తోంది మిమ్మల్ని చూసి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న మీ పార్టీని కూడా మీరు అగౌరవపరిచారన్నారు. మీరు ఉదయం నిద్రలేచాక రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. మీలా తాము తిరిగి మాట్లాడడానికి ఎంతో సమయం పట్టదన్నారు. రోజాకు తాను అండగా ఉంటానని రాధిక స్పష్టం చేశారు. తక్షణమే రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More News

Bigg Boss 7 Telugu : హౌస్‌ తొలి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్.. శివాజీ నమ్మకాన్ని నిలబెట్టిన రైతుబిడ్డ

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న లెటర్ కోసం త్యాగం చేసే టాస్క్‌లో ఇంటి సభ్యులు వాళ్లు ఏడవటంతో

Pawan Kalyan: 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయాలని నా ఆకాంక్ష: పవన్

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. జగన్‌ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ప్యూర్ ఈవీ సంస్థ కొత్తగా ఈప్లూటో 7G మ్యాక్స్ స్కూటీని విడుదల చేసింది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్కూటీ మార్కెట్లోకి రిలీజ్ అయినట్లు కంపెనీ చెబుతోంది.

VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను మోసం చేయబోయిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

Nara Lokesh: జైల్లో చంద్రబాబుపై భద్రతపై ఆందోళనగా ఉంది: లోకేశ్

జైల్లో చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారని..