Manichandana:గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన.. ఎన్టీఆర్‌కి అత్త రోల్, ఇక దశ తిరిగినట్లేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
80, 90 దశకాలలో వెండితెరను ఒక ఊపు ఊపిన నటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, భర్త కోసం కెరీర్‌లను త్యాగం చేసిన వారంతా సినిమాల్లో అమ్మ, అత్త క్యారెక్టర్లు చేస్తున్నారు. ఇంకొందరు బుల్లితెర, ఓటీటీల్లో రియాలిటీ షోలకు జడ్జిలుగానో లేదంటో వెబ్ సిరీస్‌ల ద్వారానో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. రాధ, రాధిక, రోజా, ఇంద్రజ, ఆమని, మీనా, సంఘవి, రంభ, సంగీతలతో పాటు మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ కోసం రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు.
అనుకున్నంత స్థాయిలో మణిచందనకు దక్కని స్టార్‌డమ్ :
తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు సీనియర్ నటి మణిచందన. 90వ దశకం చివరిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మణిచందన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మణిచందన.. తర్వాత పిల్ల నచ్చింది, నిజం వంటి సినిమాల్లో నటించారు. అందం, అభినయం వున్నప్పటికీ ఆమెకు అంతగా స్టార్‌డమ్ దక్కలేదు. ఆ తర్వాత కాలంలో చెప్పుకోదగ్గ పాత్రలు మణిచందనకు రాలేదు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు అవేమీ గుర్తింపు తెచ్చే పాత్రలు కాదు.
జాన్వీ కపూర్‌కు తల్లి పాత్రలో మణిచందన:
ఇలాంటి పరిస్ధితుల్లో మణిచందన దశ మార్చే ఛాన్స్ దొరికింది . ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమెకు కీలకపాత్ర లభించింది. కొరటాల శివ - ఎన్టీఆర్ కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న NTR 30లో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తల్లి క్యారెక్టర్‌లో మణిచందనను ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆమెకు పవర్‌ఫుల్ రోల్ చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమా ఫలితాన్ని బట్టి, ఆమె క్యారెక్టర్‌ను బట్టి మణిచందనకు అవకాశాలు పోటెత్తే అవకాశం వుంది.
రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 30:
ఇకపోతే.. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు ఎన్టీఆర్ 30ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సీరియల్ నటి చైత్రా రాయ్‌ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments