నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. కొడుకు మృతి, భర్త ఆరోగ్యం కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం ఎదురైంది. కరోనా మహమ్మారి ఎంతమంది ప్రాణాలు బలిగొంటుందో అర్థం కానీ పరిస్థితి. కరోనా ధాటికి వరుసగా సెలెబ్రిటీల కుటుంబాల్లో విషాదాలు జరుగుతున్నాయి. దేశంలో వరుసగా కరోనా ప్రభావంతో ప్రముఖుల మరణ వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా కరోనా సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది.
కరోనాతో కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. గత కొంత కాలంగా సంజయ్ రూప్ కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు. ఇటీవల అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సంజయ్ రూప్ తుది శ్వాస విడిచాడు. దీనితో కవిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈ విషాదానికి తోడు కవిత కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేలా మరో కష్టం వచ్చింది. ఆమె భర్త దశరధరాజ్ కి కూడా కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని సమాచారం. మహమ్మారి కరోనా కుటుంబాలని ఎలా ఛిద్రం చేస్తోందో చెప్పడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ.
నటి కవిత చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆమె నటించారు. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments