Jayasudha :బీజేపీలో చేరిన జయసుధ.. ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాదా, ముషీరాబాదా : క్లారిటీ ఇచ్చిన సహజనటి

  • IndiaGlitz, [Wednesday,August 02 2023]

సీనియర్ నటి జయసుధ బీజేపీలో చేరారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ ఆమెకు బీజేపీ కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఏడాదిగా బీజేపీ నేతలతో టచ్‌లో వున్నానని.. ఇవాళ పార్టీలో చేరానని జయసుధ వెల్లడించారు. క్రైస్తవుల ప్రతినిధిగా గళం వినిపిస్తానని ఆమె పేర్కొన్నారు. జాతీయ పార్టీ ద్వారా పేదలకు సేవ చేస్తానని.. కులమతాలకు అనుగుణంగా పనిచేస్తానని జయసుధ పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్, ముషీరాబాద్‌ల నుంచి పోటీ చేస్తానంటూ వస్తున్న కథనాలు ప్రచారం మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు.

కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలలో పనిచేసిన జయసుధ :

ఇకపోతే.. తెలుగులో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ కూడా రాజకీయాల్లో సత్తా చాటారు. 2009లో కాంగ్రెస్‌లో చేరిన ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు కాంగ్రెస్‌లోనే వున్న ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడా కొన్నాళ్లు వున్న జయసుధ 2019లో వైసీపీలో చేరి ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో సినిమాలకు , రాజకీయాలకు దూరంగా వున్న సహజనటి.. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సీజన్ కావడంతో మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు :

బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో భావిస్తున్న జయసుధ తన ప్రయత్నాలను ప్రారంభించారు. తనకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తున్న ఆమె తాజాగా శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీకి చేరుకున్న ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జయసుధకు తరుణ్ చుగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన పత్రాన్ని అందజేశారు.

More News

Minister Ambati Rambabu:తగ్గేదే లేదు 'బ్రో' .. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్న అంబటి.. ఢిల్లీకి పయనం

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిథరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ‘బ్రో’.

Pawan Kalyan:తండ్రి లేని పిల్లాడని జగన్‌ని గెలిపించారు , కానీ ఈసారి అక్కడ గెలుపు మనదే: పవన్ కల్యాణ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలిలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.

Pawan Kalyan:తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకునేలా .. ఫిల్మ్ ఛాంబర్ పనిచేస్తుందనుకుంటున్నా : పవన్ కళ్యాణ్

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.

Ambati Rambabu:పవన్‌పై బయోపిక్ తీస్తున్నా.. టైటిల్స్ ఇవే , కెలికితే ఇంతే.. సినీ ప్రముఖులూ జాగ్రత్త : అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో

Metro:హైదరాబాద్‌కు నాలుగు వైపులా మెట్రో విస్తరణ.. కేసీఆర్ బృహత్ ప్రణాళిక, మారిపోనున్న భాగ్యనగర దశ-దిశ

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.