సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది తెరపై తనదైన నటనతో మెప్పించిన నటీమణి జయంతి.. తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం వయసు మీదపడటంతో జయంతి బెంగుళూరులో ఉంటున్నారు. గత కొంతకాలంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు ఆమెను బెంగుళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఐసియు చికిత్స తీసుకుంటున్న జయంతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు. శ్రీకాళహస్తికి చెందిన జయంతి దక్షిణాది, హిందీ చిత్రాల్లో మొత్తంగా 500 చిత్రాల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout