Bhanupriya:భర్త మరణం, ఒంటరితనం.. ఇప్పుడు మొమరీలాస్: సీనియర్ హీరోయిన్ భానుప్రియ కష్టాలు
Send us your feedback to audioarticles@vaarta.com
భానుప్రియ.. ఈ పేరు వినగానే కలువల్లాంటి పెద్ద కళ్లు, అద్భుతమైన డ్యాన్సర్ గుర్తొస్తారు. 80వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్, హిందీ ప్రేక్షకులను అలరించారు భానుప్రియ. స్టార్ హీరోలు సైతం ఆమెతో డ్యాన్స్ చేయడానికి భయపడేవారు. మరో శ్రీదేవి అన్నంతగా పేరు తెచ్చుకున్న భానుప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్. సితారతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తొలి సినిమా సక్సెస్‌తో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. నృత్య ప్రధానమైన చిత్రాలంటే దర్శక నిర్మాతలు ఖచ్చితంగా భానుప్రియనే సంప్రదించేవారు. దాదాపు 20 ఏళ్లపాటు సౌత్‌ను ఏలిన ఆమె.. అందరు అగ్రహీరోల సరసన నటించారు. కెరీర్ పీక్స్‌లో వుండగానే అమెరికాలో స్థిరపడిన ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్‌ను పెళ్లాడారు భానుప్రియ. వీరికి అభినయ అనే కుమార్తె కూడా వుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి అలరించారు.
భర్త మరణంతో కృంగిపోయిన భానుప్రియ:
ఇదిలావుండగా.. ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు పంచుకున్నారు. భర్త మరణంతో బాగా కృంగిపోయిన భానుప్రియ చాలా కాలం వరకు తేరుకోలేకపోయారు. ప్రస్తుతం మెమొరీ లాస్‌తో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. తాను నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ మరిచిపోయానని.. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం లేదని భానుప్రియ తెలిపారు. ఇటీవల ఓ సినిమా లోకేషన్‌లో డైలాగులు మరిచిపోయినట్లు ఆమె చెప్పారు. కాసేపటికి తేరుకుని మరోసారి చూసుకున్నాకే డైరెక్టర్ యాక్షన్ అన్నారని భానుప్రియ పేర్కొన్నారు. ఒత్తిడి, డిప్రెషన్‌కు గురికాకపోయినా .. కేవలం ఆరోగ్యం బాగోకపోవడం వల్లే తనకు మెమొరీలాస్ సమస్యల ఏర్పడింది.. దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
లండన్‌లో చదువుకుంటోన్న భానుప్రియ కుమార్తె :
ఇక భర్తతో విభేదాలంటూ వస్తున్న వార్తలను భానుప్రియ ఖండించారు. తాము విడిపోలేదని.. ఆయన హైదరాబాద్‌లో వుంటే, తాను చెన్నైలో వుండేదాన్నని చెప్పారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుండేదని తెలిపారు. తన కుమార్తె అభినయ ప్రస్తుతం లండన్‌లోని లాఫ్‌బరో యూనివర్సిటీలో నేచురల్ సైన్స్ చదువుతోందని భానుప్రియ చెప్పారు. తను సినిమాలు చూస్తుంది కానీ.. సినిమాల్లో నటించాలనే ఆసక్తి మాత్రం లేదని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భానుప్రియ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments