చిరు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర‌తో పాటు నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో చిరు సోద‌రి పాత్ర ఒక‌టి. ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనేది సినీ వ‌ర్గాల్లో చర్చ‌గా మారింది. చాలా మంది హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. రీసెంట్‌గా సుహాసిని పేరు కూడా విన‌ప‌డింది.

అయితే తాజా స‌మాచారం మేర‌కు చిరు సోద‌రి పాత్ర‌లో ఖుష్బూ న‌టించ‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. గ‌తంలో వీరిద్ద‌రూ అక్కా, త‌మ్ముడు పాత్ర‌లో స్టాలిన్ సినిమాలో న‌టించారు. అంతా ఓకే అయితే ఇప్పుడు అన్నా, చెల్లెలుగా న‌టించ‌బోతున్నారట‌. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే చిరంజీవి త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేసి త‌దుప‌రి లూసిఫ‌ర్ రీమేక్‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నార‌ట‌. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌ను తెలుగులో రానా పోషించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చిరు సోద‌రుడు, ఖుష్బూ భ‌ర్త పాత్ర కూడా క‌థ‌లో చాలా కీలకంగా ఉండ‌నున్నాయి. మ‌రి ఈ పాత్ర‌ల‌ను ఎవ‌రు క్యారీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

మాయదారి క‌రోనా అని సినీ జ‌నాలు క‌రోనా గురించి తెగ తిట్టుకుంటున్నారు. కోవిడ్ 19 ప్ర‌భావంతో బాగా ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది.

‘గరీబ్ కల్యాణ్ యోజన’ను దీపావళి వరకూ పొడిగిస్తున్నాం: మోదీ

కరోనా విషయంలో మరింత అప్రమత్తత వహించాల్సిన సమయంలో మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

ఏమాత్రం ఊహించని.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన డబ్య్లూహెచ్‌వో

కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ ఏ ఒక్కరూ ఊహించని.. షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్‌లాక్-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం

లాక్‌డౌన్ సడలింపులను ప్రకటిస్తూ గతంలో ఒకసారి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.