యాంకర్‌ను హోటల్‌కు పిలిచిన సీనియర్ నటుడు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదిగో మీరు చదువుతున్న ఈ వ్యవహారం టాలీవుడ్ సీనియర్ నటుడి బాగోతం. ఒకట్రెండు కాదు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్లో ఈయన ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇప్పటికే ఫలానా హీరోతో నటించలేదు అనే కోరిక మిగలకుండా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా దాదాపు అందరితోనే నటించేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీనియర్ లేకుండా సినిమా ఉండదంటే ఆయన నటన పరంగా ఎలాంటోడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదంతా ఆయనలో ఓ కోణం మాత్రమే.. రెండో కోణం తెలిస్తే ఛీ కొట్టడమే కాదు.. కనపడితే కుక్కను కొట్టినట్లు కొడతారేమో మరి. ఓ రేడియో యాంకర్ ఇంటర్వ్యూ చేసి ఇన్విటేషన్ ఇద్దామని అనుమతి తీసుకొని వెళ్లింది. కానీ.. ఇంతవరకూ బాగానే ఉంది.. అక్కడికెళ్లిన తర్వాత ఆ హాట్ హాట్‌గా కుర్ర యాంకర్‌ను చూడగానే ఈయనకు నోటీ వెంట బూతులొచ్చేశాయట.
ఒక రాయేద్దాం అని అనుకున్నాడో లేకుంటే ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే కదా అనుకున్నాడో ఏమోగానీ.. ఆ యాంకర్‌ను లేని పోని మాటలు చెప్పి బుట్టలో వేసుకోవాలని చూశాడట. వీటన్నింటికీ ‘బయోపిక్’ అనే పదం తగిలించి.. నువ్ తప్ప ఇంకెవ్వరూ నా జీవిత కథను రాయడానికి వీల్లేదు. రాస్తే గీస్తే నువ్వే రాయాలి.. ఇంకెవ్వరికీ ఆ అవకాశం ఇవ్వను. నువ్ రాస్తే ఆ బయోపిక్కే అందమొస్తోంది...అని పులిహోర కలపడం మొదలెట్టాడట. అంతేకాదు నాలుగైదు రోజులు బయటికి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి.. నువ్ ఓకే అంటే రిసార్ట్‌కు వెళ్దాం అక్కడ అన్నీ కోణాలు విప్పి మరీ మొత్తం వివరిస్తా అని సదరు యాంకర్‌తో ఆ సీనియర్ చెప్పాడట.
అయితే ఆ సీనియర్ మాటలు పదే పదే డబుల్ మీనింగ్‌తో ఉండటం.. తిక్క తిక్కగా మాట్లాడుతుండటంతో అసలు విషయం తెలుసుకుని తిన్నగా అక్కడ్నుంచి తప్పించుకుందట. అలా బయటికొచ్చిన ఆ యాంకర్.. ఛీ ఫలానా సీనియర్ నటుడు ఇలా చేశాడంటూ నలుగురిలో చెప్పుకుని కంట తడిపెట్టుకుందట. అసలు ఆయన అలాంటోడు అని తాను కలలో కూడా ఊహించలేదని.. ఛీ ఇంత శాడిస్టా అంటూ దుమ్మెత్తి పోస్తోందట. ప్రస్తుతం ఈ సీనియర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. మరి యాంకర్ పిల్ల ఆరోపణలపై సీనియర్ రియాక్ట్ అవుతాడా..? కరెక్టే కదా ఆ పిల్ల చెప్పింది.. ఇంకా మనం రియాక్ట్ అయితే సిగ్గుపోతుందని ఆ సీనియర్ సైలెంట్ అయిపోతాడో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com