జగన్ సమక్షంలో వైసీపీ గూటికి సీనియర్ నటుడు

  • IndiaGlitz, [Friday,January 11 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టి పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగించారు. ఆఖరి రోజున పలువురు ప్రముఖులు, నేతలు జగన్‌‌ను కలిసి అభినందనలు తెలిపి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గత ఏడాది జగన్ పాదయాత్రలో పాల్గొని.. ఆయనతో కలిసి అడుగులేసిన సినీయర్ నటుడు భానుచందర్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌‌.. భానుచందర్‌‌కు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా గతంలో జగన్‌‌ను కలిసిన ఆయన పార్టీలో చేరికపై చర్చించారు. ఇవాళ పాదయాత్ర చివరి రోజున భానుచందర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి నాయకుడ్ని ఇప్పటి వరకూ చూడ్లేదు..!

ప్రజల కోసం తపించే వైఎస్‌ జగన్‌ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు. జనంతో ఇంతగా కలిసిపోయే ఒకే ఒక్క నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనకు ఎవరూ సాటి రారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల పాటు వైఎస్‌ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని భానుచందర్ వ్యాఖ్యానించారు.

కాగా.. ఇప్పటికే సీనియర్ నటుడు విజయచందర్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, కృష్ణుడుతో పాటు పలువురు సినీ ప్రముఖులు జగన్‌‌ నాయకత్వం నచ్చి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. పోసాని కృష్ణ మురళీ, చోటా కే నాయుడు లాంటి వారు కూడా జగన్ నాయకత్వం నచ్చి పాదయాత్రలో ఆయనతో పాటు అడుగులేశారు. త్వరలోనే మరికొందరు పేరుగాంచిన నటులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వినవస్తున్నాయి.

More News

ఏప్రిల్‌లో 'దబాంగ్ 3'

సల్మాన్‌ఖాన్‌కి క్రేజ్ తెచ్చిన చిత్రాల్లో 'దబాంగ్' ఒకటి. ఈ సినిమాను సీక్వల్‌గా 'దబాంగ్ 2'ను కూడా తెరకెక్కించారు.

తెలుగులో వివాదస్పద చిత్రం

మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ జీవిత కథను 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' అనే పేరుతో సినిమాగా తెరకెక్కించారు.

విజయ్ దేవరకొండతో క్యాథరిన్

చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా తెలుగులో నటించనుంది. ఇంతకు ఏ హీరోతో అనుకుంటున్నారా!.

కేర‌ళ‌లో రానా

తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్షకులకు కూడా రానా దగ్గుబాటి సుపరిచితుడైన హీరోయే.

విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.