ఆర్మీకి 117 ఎకరాల భూమి విరాళం.. అది అవాస్తవం, నేనేమి ఇవ్వలేదు : పుకార్లకు సుమన్ చెక్
Send us your feedback to audioarticles@vaarta.com
అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు మన చుట్టూ చాలా మంది వున్నారు. ఇక సోషల్ మీడియా రాకతో ఈ పిచ్చి మరింత ముదిరింది. జరగనవి జరగనట్లుగా వేడి వేడి వార్తలు వండి వార్చే యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లు దీనికి అదనం. వీటి నిర్వాహకుల ఓవరాక్షన్ కారణంగా ఎంతోమంది ప్రముఖులు ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తర్వాతే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితులు సైతం ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి సీనియర్ నటుడు సుమన్ చేరారు.
అసలేం జరిగిందంటే.. స్వతహాగా సుమన్‌కు దేశభక్తి ఎక్కువ. కొద్దిరోజుల క్రితం ఇండియన్ ఆర్మీ కోసం 117 ఎకరాల భూమిని ఆయన విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సమీపంలోనే ఆ భూమి ఉంది. అయితే... ఆ భూమి తమదని, దీనిని మీరు విరాళంగా ఎలా ఇస్తారంటూ కొందరు కోర్టుకెక్కారు. అప్పటి నుంచి న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్నాయి. నిజానికి ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సుమన్ వద్దే ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇతరుల వద్ద కూడా ఈ పత్రాలు ఉన్నాయి. అందువల్ల ఈ భూమి యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయో ఇంకా తేలలేదు.
ఇదిలావుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆ 117 ఎకరాల భూమిని భారత సైన్యానికి సుమన్ దానం చేసినట్టు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సుమన్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే... వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతానని సుమన్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments