తమిళ చిత్ర సీమలో కోవిడ్ కలకలం.. కట్టప్పకు పాజిటివ్, పరిస్ధితి విషమం..?
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ పరిశ్రమలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రం, వడివేలు, మహేశ్‌బాబు , మంచు లక్ష్మి, త్రిష, మీనా , మనోజ్, విశ్వక్ సేన్, తమన్ తదితరులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇప్పుడు మరో సినీనటుడికి వైరస్ సోకింది. ‘బాహుబలి’ చిత్రంలో కట్టప్పగా ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ నటుడు సత్యరాజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీనటులు, అభిమానులు.. కట్టప్ప క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఆదివారం సంపూర్ణంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి(జనవరి 9) నుంచి లాక్‌డౌన్ అమలులోకి రానుంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 8,981 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజధాని చెన్నైలోనే 4,531 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తమిళనాడులో 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా.. భారత్‌లో వరుసగా రెండో రోజు కొత్త కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,41,986 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 40 వేల కేసులు నమోదయ్యాయి. అటు ఒమిక్రాన్ విషయానికి వస్తే దేశంలో ప్రస్తుతం 3,071 పాజిటివ్ కేసులు వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com