Sarath Babu:సీనియర్ నటుడు శరత్ బాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం శరత్ బాబుకి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి గురైన సమస్య ఏంటన్న దానిపై క్లారిటీ లేదు.
అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా శరత్ బాబు :
కాగా.. 1970-80 దశకాలలో శరత్ బాబు స్టార్‌గా వెలుగొందారు. వైట్ స్కిన్ టోన్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా అప్పట్లో ఆయన నిలిచారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు, సాగర సంగమం, బొబ్బిలి సింహం , శివరామరాజు ఇలా ఆయన కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలు వున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేసినప్పటికీ ఆయన చెన్నైలోనే తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.
రమాప్రభతో ఎక్కువ రోజలు సాగని బంధం :
శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే కాపురంలో మనస్పర్థల కారణంగా ఈ జంట ఎక్కువ రోజులు కలిసి లేరు. ఆ తర్వాత స్నేహ నంబియార్ అనే నటిని శరత్ బాబు పెళ్లాడారు. అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. తన కెరీర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు శరత్ బాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments