Prabhu Ganesan : సీనియర్ నటుడు ప్రభుకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ సీనియర్ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ప్రభుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు కిడ్నీలో రాళ్లు వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వాటిని డాక్టర్లు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రభుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. అయితే ప్రభు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోలుకుని క్షేమంగా ఇంటికి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిలో ప్రభు కుటుంబ సభ్యులను పరామర్శించినట్లుగా తెలుస్తోంది.
డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితం:
దివంగత మహానటుడు శివాజీ గణేషన్ కుమారుడైన ప్రభు తండ్రి బాటలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తమిళంతో పాటు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకున్నాడు. ఆయన నటించిన సూపర్‌హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యేవి. ఈ తరం వారికి ఆయన చంద్రముఖిలో రజనీకాంత్ ఫ్రెండ్‌గా, డార్లింగ్‌లో ప్రభాస్ తండ్రిగా సుపరిచితుడు. లేటు వయసులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా వుంటున్న ప్రభు.. రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ 1తో పాటు ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 విడుదలకు సిద్ధంగా వుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న ప్రముఖుల మరణాలు:
ఇదిలావుండగా.. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. కే. విశ్వనాథ్, జమున, వాణీ జయరామ్, తారకరత్న మరణాలతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక రీసెంట్గా కోలీవుడ్ హాస్య నటుడు మయిల్ స్వామి మరణంతో తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతేకాదు.. మొత్తం కోలీవుడ్ అంతా తరలివచ్చి మయిల్ స్వామికి నివాళులర్పించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout