VK Naresh : పవిత్ర లోకేశ్‌తో పెళ్లి.. ఆ రూమర్స్ అంతా రమ్య పనే, డబ్బు కోసమే అంతా: నరేశ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కన్నడ నటి పవిత్రా లోకేశ్ తో ఆయన కొద్దికాలంగా క్లోజ్ గా వుండటం.. ఎక్కడ చూసినా వీరద్దరే కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. నరేశ్ - పవిత్రా లోకేష్ వివాహం మహా బలేశ్వరంలో జరిగిందని .. ఎవ్వరినీ పిలవకుండా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కథనాలు కూడా వచ్చాయి. దీనికి రెండు వైపుల నుంచి ఎలాంటి స్పందనలు లేకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.
నరేశ్ కు చాలా మందితో సంబంధాలు: మూడో భార్య
ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంటరవ్వడం తన భర్తపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నరేశ్ కు చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలు వున్నాయని.. తనకు ఎన్నోసార్లు దొరికిపోయాడని ఆమె ఆరోపించారు. తాను నరేశ్ తోనే జీవిస్తానని.. విజయ నిర్మలకు మాటిచ్చానని, జీవితాంతం దానికి కట్టుబడే వుంటానని రమ్య స్పష్టం చేశారు.
నా కుటుంబాన్ని విడగొట్టాలని చూసింది: నరేష్
ఈ క్రమంలో నరేశ్ స్పందించారు. రమ్య చేసే ఆరోపణల్లో నిజం లేదని.. కర్ణాటకకు చెందిన ఓ ఛానెల్ తో కలిసి రమ్య ఈ రూమర్స్ వ్యాప్తి చేసిందని ఆయన ఆరోపించారు. రూ.50 లక్షల కోసం ఇంట్లో వాళ్లని వేధించిందని.. తమ కుటుంబాన్ని విడగొట్టాలని చూసిందని నరేశ్ వ్యాఖ్యానించారు. నెల క్రితమే రమ్య రఘుపతికి విడాకుల నోటీసులు పంపానని... ఆ తర్వాతే తన నాలుగో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కన్నడ మీడియాకి దీనికి సంబంధించి వివరణ ఇచ్చానని నరేశ్ పేర్కొన్నారు. రమ్య రఘుపతి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏమైనా వుంటే హైదరాబాద్ లో చూసుకోండి.. బెంగళూరులో కాదు: పవిత్రా లోకేష్
అయితే ఇప్పటివరకు మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా స్పందించని పవిత్రా లోకేశ్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. బెంగళూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నరేశ్ చాలా మంచి వ్యక్తి అని..ఆయనకు, తనకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవని పవిత్ర అన్నారు. రమ్య రఘుపతికి నరేశ్‌తో ఏమైనా సమస్య ఉంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఏమైనా వుంటే హైదరాబాద్‌లో చూసుకోవాలని పవిత్రా లోకేష్ సూచించారు. రమ్య కేవలం పేరు, పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com