నీళ్లు లేని బావిలో దూకాలంటే దూకొచ్చు.. ప్రకాష్ రాజ్ పై నరేష్ సెటైర్లు!

  • IndiaGlitz, [Wednesday,July 07 2021]

మా ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గత మార్చిలోనే మా ఎన్నికలు జరగాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల సెప్టెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు సెప్టెంబర్ లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనితో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిల్ లాంటి వారికి ఇది ఊహించని పరిణామమే.

ప్రతి రెండేళ్లకు ఓసారి మార్చిలో మా ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ కరోనా వల్ల మార్చిలో ఎన్నికలు నిర్వహించలేదు. ఏప్రిల్ లో ప్రకాష్ రాజ్ మా ఎన్నికలు ఎప్పుడు అని అసోసియేషన్ ని ప్రశ్నించారు. దీనితో సెప్టెంబర్ లో అని అసోసియేషన్ అతడికి రిప్లై ఇచ్చింది.

అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంతలో మా ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు బయటకు వచ్చిన వార్త ప్రకాష్ రాజ్ అసహనం పెరిగేలా చేసింది. తెలంగాణ స్టేట్ సొసైటిస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా బోర్డు అత్యధికంగా 6 ఏళ్ల పాటు కొనసాగవచ్చు.

మా మాత్రం 2 ఏళ్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొందరు మా సభ్యులు ఇదే కమిటీని మరికొంత కాలం కొనసాగించాలని లేఖలు రాశారట. లా ప్రకారం వెళితే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

కానీ ఎన్నికల నిర్వహణ నిర్ణయాన్ని మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీకే వదిలేస్తున్నారు. మా ఎన్నికలపై నిర్ణయం తీసుకునేందుకు జూలై 9న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కమిటీలో కొందరు సభ్యులు కోవిడ్ బారీన పడ్డారు. దీనితో సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులని బట్టి ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లే తెలుస్తోంది.

ఈ విషయాన్నే నరేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మా ఎన్నికలు ఎప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ పై సెటైర్లు పేల్చారు. కొందరు పదే పదే ఎన్నికలు ఎప్పుడు అని అడుగుతున్నారు. అది బావిలో నీరు నింపక ముందే దుకావచ్చా అని అడుగుతున్నట్లు ఉంది. దానికి మేము కూడా అలాగే ట్రై చేయండి అని రిప్లై ఇస్తాం అని నరేష్ అన్నారు.

More News

మోడీ కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్.. ఆ 43 మంది వీరే!

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి తన కేబినెట్ ని విస్తరిస్తున్నారు.

మేం థియేటర్లు ఓపెన్ చేయం.. టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి థియేటర్ల పునః ప్రారంభానికి సిద్ధం అవుతున్న తరుణంలో టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది.

మాకు 'పీకే' వద్దు, ఏపీలో చనిపోతుంది అని తెలుసు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.

'కప్పేలా' రీమేక్ లో ఖైదీ, మాస్టర్ విలన్ అర్జున్ దాస్.. సితార బ్యానర్ లో..

తమిళ నటుడు అర్జున్ దాస్ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. హీరో కార్తీ నటించిన ఖైదీ, విజయ్ మాస్టర్ చిత్రాల్లో అర్జున్ దాస్ విలన్ రోల్స్ చేశాడు.

రామ్-లింగుసామి కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని షూటింగ్ చేయడానికి రెడీ. బౌండ్ స్క్రిఫ్ట్‌తో దర్శకుడు లింగుసామి రెడీ.