సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన నటుడు నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నటుడు సీనియర్ నరేష్.. స్టోన్ ఇన్ఫ్రా కంపెనీ యజమానిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్ తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని.. ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టోన్ ఇన్ఫ్రా కంపెనీల పేరుతో తనను మోసం చేశాడని పేర్కొన్నారు. తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో రూ.7.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని వెల్లడించారు. ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకూ తిరిగి చెల్లించలేదన్నారు. దీనిపై మూడు రోజుల క్రితం సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని నరేష్ పేర్కొన్నారు.
‘‘లింగం శ్రీనివాస్.. కీ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో రెండు మూడు కంపెనీలు పెట్టి.. ఇలా మా బిల్డర్స్ ఫియోనిక్స్‌తో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీ అయి ఉన్నాడు. ఈయన మా కుటుంబంతో ఉన్న పరిచయంతో హ్యాండ్ లోన్‌గా రిక్వెస్ట్ చేసి రూ.7.5 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. మా మేనమామ రఘునాథ్‌తో అసోసియేట్స్. ఆయన ద్వారా శ్రీనివాస్ మా దగ్గర రూ.7.5 కోట్లు తీసుకుని ఆరేళ్లు దాటింది. మాకు ఎటువంటి రిటర్న్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నేను వెంటనే సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాను. కోర్టులో కూడా అ్రోచ్ అయ్యాను. ఇంతకు ముందు కూడా విజయవాడకు తీసుకెళ్లి ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు మాకు రూ.10 కోట్లకు పైనే రావాలి. కోవిడ్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ ఫిర్యాదు మేము ఇవ్వడం జరిగింది. వెంటనే నా ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినందుకు తెలంగాణ పోలీసులకు థాంక్స్’’ అని ఓ వీడియో ద్వారా నరేష్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout