Kota Srinivasa Rao:చనిపోయానంటూ వార్తలు .. పోలీసులు మా ఇంటికి వచ్చారు , డబ్బు కోసం అలాంటి పోస్టులా : కోటా శ్రీనివాసరావు

  • IndiaGlitz, [Tuesday,March 21 2023]

సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి. ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేరారు. కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. అసలే కే. విశ్వనాథ్, జమున, తారకరత్నల మరణాలతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ ఈ వార్తతో ఉలిక్కిపడింది.

డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆటలా :

అయితే కాసేపటికే ఇది తప్పుడు వార్తని తేలింది. కోటా శ్రీనివాసరావు పూర్తి ఆరోగ్యంతో వున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ కాసేపటికీ కోటా రంగంలోకి దిగారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఇలా అన్నారు. ‘‘ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి.. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియాలో వేశాడట నేను పోయానని. కోటా శ్రీనివాసరావు దుర్మరణమని.. అలాంటి వార్తలు నాకు తెలియదు. తెల్లారి పండగ, ఏం చేయాలి అని మాట్లాడుకుంటుండగా .. పొద్దున 7.30 నుంచి ఇప్పటి వరకు నేను 50 ఫోన్లు మాట్లాడా. మా కుర్రాడు మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే పోలీసులు వచ్చేశారు. మీకు నివాళులర్పించడనాికి ప్రముఖులు వస్తారు కదా సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాం అని పోలీసులు చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని మనవి చేసుకుంటూ .. ప్రజలు కూడా గట్టిగా రియాక్ట్ అవ్వాలి. డబ్బు సంపాదించడానికి బోల్డన్నీ పనులు వున్నాయి. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు.. నమస్కారం.’’ అంటూ కోటా ముగించారు.

More News

Amitabh Bachchan:షెహన్‌షా ఈజ్ బ్యాక్ : గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా బిగ్‌బి

ఇటీవల సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు.

MLC Kalvkuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం : ముగిసిన కల్వకుంట్ల కవిత విచారణ.. రేపు మరోసారి రమ్మన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది.

Karthika Nair:గోల్డెన్‌ వీసా అందుకున్న నటి కార్తిక నాయర్‌

సీనియర్‌ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఎఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందింది. ఉదయ్‌  సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా,

Vairam:దేవరాజ్ తనయుడు హీరోగా 'వైరం' చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్

Railway Station:రైల్వే‌ ఫ్లాట్‌ ఫాం టీవీల్లో పోర్న్ వీడియోలు.. ఖంగుతిన్న ప్రయాణికులు, 3 నిమిషాల పాటు స్ట్రీమింగ్

సాధారణంగా రైల్వేస్టేషన్‌లలో అనౌన్స్‌మెంట్‌లు వచ్చే టీవీలు వుంటాయి. వాటిల్లో రైలు వచ్చే వివరాలతో పాటు కొన్ని వాణిజ్య ప్రకటలు వస్తూ వుంటాయి.