మీ శ్రద్ధకు కృతజ్ఞుడిని... సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకున్నారు. ఈ క్రమంలో తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కి లేఖ రాశారు.
బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఫోన్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు చాలా సంతోషిస్తున్నా. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను చెల్లించడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది.
మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల , వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది’ అని కైకాల ఆ లేఖలో పేర్కొన్నారు. తాను సంతకం చేయలేకపోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని సత్యనారాయణ అన్నారు. అలాగే తాను ఆసుపత్రిలో వున్నప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కైకాల కృతజ్ఞతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com