Chandramohan:బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

సీనియర్ నటులు చంద్ర మోహన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 9.45నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చంద్ర మోహన్ వయసు 82 సంవత్సరాలు కాగా ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

1941వ సంవత్సరంలో కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో రంగుల రాట్నం చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయన నటించి మెప్పించారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. హీరో పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన రాణించారు. పదహేరళ్ల వయసు, సిరిసిరి ముద్వ చిత్రాల్లోని నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. వయసు పైబడిన తర్వాత తండ్రి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన తండ్రిగా నటించిన ఢీ, 7జీ బృందావన కాలనీ, నువ్వే నువ్వే తదితర చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా శ్రీనువైట్ల చిత్రాల్లో ఆయన నటించారు.

More News

Siddaramaiah:కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సిద్ధరామయ్య

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Chandrababu:చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా చేసిన హైకోర్టు

స్కిల్ డెవల్‌ప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Raghavendra Rao:దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది.

BJP:14 మందితో బీజేపీ నాలుగో(తుది) జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు.

Congress:కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్న తుది జాబితా లిస్ట్

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు.