Brahmaji:మెగా ఫ్యామిలీపై కామెంట్స్.. చిన్న ఆర్టిస్టులే కదా భయపడతారెందుకు: రోజాకు బ్రహ్మాజీ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై మాత్రమే విరుచుకుపడే రోజా నేరుగా మెగా బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లను ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. దీనికి అన్నదమ్ములు ముగ్గురూ రోజాకి ఘాటుగా బదులిచ్చారు. అయినప్పటికీ విషయం సద్దుమణగలేదు. తమ అభిమాన నటుల్ని అంటారా అంటూ ఫ్యాన్స్ రోజాను ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి వీర విధేయులుగా వుండేవారు సైతం రోజాను టార్గెట్ చేశారు.
మెగా ఫ్యామిలీకి భయపడుతున్నారన్న రోజా :
ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రోజా మాట్లాడిన మాటలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. మెగా కుటుంబంలో అరడజను మంది హీరోలు వున్నారని, అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు వారికి భయపడి మద్ధతుగా నిలుస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ అంటే వారికి ప్రేమ కాదని, భయమని రోజా కామెంట్ చేశారు. హైపర్ ఆది లాంటిని ఉద్దేశిస్తూ వారంతా చిన్న ఆర్టిస్టులని, వెనుక ఎవరో వుండి వారితో మాట్లాడిస్తున్నారని .. సినిమా ఛాన్స్‌లు రావని భయపెడుతున్నారని రోజా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
మెగా ఫ్యామిలీకి క్యాంపెయిన్ చేయమని అడగలేదన్న బ్రహ్మాజీ:
ఈ వెంటనే సీనియర్ నటుడు బ్రహ్మాజీ వివాదంలోకి ఎంట్రీ ఇస్తూ రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. దీనికి రోజా మాట్లాడిన వీడియోను జోడించారు . మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout