సెల్ఫీ రాజా విడుదల తేదీ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం సెల్ఫీ రాజా. ఈ చిత్రాన్ని సిద్ధు ఫ్రమ్ సికాకుళం ఫేం జి.ఈశ్వర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గోపీ ఆర్ట్స్ బ్యానర్ పై చలసాని రామ బ్రహ్మాం చౌదరి నిర్మించగా... ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై లిమిటెడ్ బ్యానర్ పై రామ బ్రహ్మాం సుంకర సమర్పిస్తున్నారు. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి, కామ్న రనవత్ నటించారు.
సెల్ఫీ రాజా ఫస్ట్ లుక్ & టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ట్రేడ్ వర్గాల్లో సెల్ఫీ రాజాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి సెల్ఫీరాజా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి..సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అల్లరి నరేష్ కి సెల్ఫీ రాజా సక్సెస్ అందిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com