మిస్ యు నాన్న అంటున్న సెల్ఫీ రాజా..

  • IndiaGlitz, [Friday,June 10 2016]

చెవిలో పువ్వు సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...ప్రేమ ఖైదీ చిత్రంతో తొలి విజ‌యాన్ని సాధించి ఆత‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించారు స్వ‌ర్గీయ ఇ.వి.వి స‌త్యానారాయ‌ణ‌. మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌, యువస‌మ్రాట్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్...ఈ టాప్ స్టార్స్ న‌లుగురితో విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించారాయ‌న‌.

ఈరోజు ఇ.వి.వి జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఈలోకం మీరు లేర‌న్న‌ది ఓ అబ‌ద్ద‌మ‌నుకుంటూ...మీరు పంచిన నువ్వుల్లో మిమ్మ‌ల్ని వెతుక్కుంటూ...మీ స్మృతిలే మా ఊపిరిగా..మీ ఆలోచ‌న‌లే ఆశీస్సులుగా...ప్ర‌తి క్ష‌ణం మాతోడు మీరుగా సాగిపోతున్నాం...ఇప్ప‌టికీ మీరే మా శ్వాస అంటున్నాం..అంటూ ఇ.వి.వి కుటుంబ స‌భ్యులు త‌మ స్పంద‌న తెలియ‌చేసారు. అలాగే ఇ.వి.వి జ‌యంతి సంద‌ర్భంగా అల్ల‌రి న‌రేష్ తాజా చిత్రం సెల్ఫీ రాజా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో అల్ల‌రి న‌రేష్ స్పందిస్తూ...సెల్ఫీ రాజా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి నాన్న‌ జ‌యంతి క‌న్నా మంచి రోజు ఏముంటుంది. మిస్ యు నాన్న అంటూ సెల్ఫీ రాజా ఫ‌స్ట్ లుక్ పోస్ట్ చేసారు. తండ్రి జ‌యంతి రోజు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సెల్ఫీ రాజా స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

అభిమాని పనికి త్రిష సంతోషం...

అభిమానానికి హద్దులుండవు..ఒక్కొక్కరు ఒక్కో విషయంపై,ఒక్కో వ్యక్తిపై రకంగా అభిమానాన్ని చూపుతుంటారు.

కబాలి క్రేజ్ అలా ఉంది మరి....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి.రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది.

బ‌స‌వ‌తార‌క‌మ్ హాస్ప‌ట‌ల్లో బాల‌య్య జ‌న్మ‌దిన వేడుక‌లు

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ పుట్టిన‌రోజు ఈ రోజు (జాన్ 10). బాల‌య్య త‌న పుట్టిన‌రోజును అమెరికాలో అభిమానుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటుంటే..హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌క‌మ్ ఇండో - అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ లో బాల‌య్య పుట్టిన‌రోజు వేడుక‌ను నిర్వ‌హించారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మన ఊరి రామాయణం'

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటనతో పాటు దర్శకత్వం,నిర్మాణం కూడా చేస్తుంటాడనే సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ ఆ పనిని కూడా భుజాలకెత్తుకున్నాడు....

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం'శభాష్ నాయుడు'.